తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Minister Suresh on Schools: 'సెలవులు పొడిగించే ఆలోచన లేదు' - మంత్రి సురేశ్ వార్తలు

ఏపీలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే ఉద్దేశం తమకు లేదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే తమకు ఆ ఆలోచన లేదని తెలిపారు.

minister on holidays
సెలవుల పొడిగింపు ఆలోచన లేదన్న ఏపీ మంత్రి సురేశ్‌

By

Published : Jan 16, 2022, 4:40 PM IST

Minister Suresh on Schools: ఏపీలో విద్యాసంస్థల సెలవుల పొడిగింపు ఆలోచన లేదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కాకుమానులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పటికైతే పొడిగింపు అలాంటి ఆలోచన లేదన్నారు.

తెలంగాణలో ఈనెల 30 వరకు సెలవులు
holidays for schools in telangana: కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

దేశంలో కరోనా ఉద్ధృతి..

Corona cases in India: మరోవైపు భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు. కొత్తగా.. 2,71,202 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 314 మంది మరణించారు. 1,38,331 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు:37,122,164
  • మొత్తం మరణాలు:4,86,066
  • యాక్టివ్ కేసులు:15,50,377
  • మొత్తం కోలుకున్నవారు:3,50,85721

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details