తెలంగాణ

telangana

ETV Bharat / city

'జగన్ కనుసైగ చేస్తే... తెదేపాను వైకాపా స్టోర్ రూమ్​లో పెడతా' - తెదేపాపై కొడాలి నాని తీవ్ర విమర్శలు

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ పార్టీ మార్పుపై తెదేపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు.

kodali nani

By

Published : Nov 16, 2019, 6:46 PM IST

Updated : Nov 16, 2019, 11:46 PM IST

'జగన్ కనుసైగ చేస్తే... తెదేపాను వైకాపా స్టోర్ రూమ్​లో పెడతా'


జగన్ కనుసైగ చేస్తే... తెదేపాను వైకాపా స్టోర్ రూమ్​లో పెడతానని ఏపీ మంత్రి కొడాలి అన్నారు. సన్న బియ్యం ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు... దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో తెదేపా ఎప్పుడైనా... అధిక సీట్లు సాధించినట్లైతే రాజకీయాల నుంచి వెళ్లిపోతానన్నారు. దేవినేని అవినాష్ వైకాపాలో చేరారని... వల్లభనేని వంశీ ఇంకా చేరలేదని వివరించారు.

తెదేపా విధానాలు నచ్చకనే వారు పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్లినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కొడాలి నాని నిలదీశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​కు ఏం పేరు పెట్టాలో ఆయనే చెప్పాలని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: ఆర్టీసీ గురించి ఎండీ సునీల్‌శర్మకు ఏం తెలుసు: అశ్వత్థామరెడ్డి

Last Updated : Nov 16, 2019, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details