చిత్ర పరిశ్రమ అంశంలో ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఖండించారు. సినీ పరిశ్రమ అంటే నలుగురు నిర్మాతలు మాత్రమే కాదని పేర్కొన్నారు. పవన్ తాటాకు చప్పుళ్లకు జగన్ ప్రభుత్వం బెదిరేదే లేదన్న కొడాలి నాని.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో 'ఆటో రజిని' చిత్ర ప్రారంభ వేడుకలో పాల్గొన్న సందర్భంలో నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
nani on pk: పవన్ కల్యాణ్‌కు జగన్ ప్రభుత్వం బెదరదు : నాని - పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి కొడాలి నాని ఖండించారు. హైదరాబాద్ లో ఓ చిత్ర వేడుకలకు హాజరైన మంత్రి.. పవన్‌పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
nani on pk
గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని కొంతమంది పెద్ద నిర్మాతలు ప్రజల నుంచి డబ్బును విచ్చలవిడిగా దోచుకున్నారని మంత్రి కొడాలి ఆరోపించారు. వారిని కట్టడి చేసి.. చిన్న సినిమాలను బతికించేందుకే.. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'జగన్‌ను ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా'.. పవన్‌కు కొడాలి సవాల్ !