తెలంగాణ

telangana

ETV Bharat / city

polavaram: 'పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం వేగవంతం' - ap news

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులపై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ సమీక్ష జరిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డ్యాం పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన అనిల్ కుమార్.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు.

Anil kumar
Anil kumar

By

Published : Aug 11, 2021, 4:50 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావసం కల్పించేందుకు పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యాం​లో కుడి వైపున 96 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మించే పనులు చేపట్టామని.. నెలాఖరులోగా రక్షిత స్థాయికి దిగువ కాఫర్ డ్యాంను పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు. త్వరలో ఎగువ కాఫర్ డ్యాం పనులు పూర్తవుతాయని తెలిపారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన అనిల్ కుమార్.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ నెలలో 5 నేల నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడ్వాయిలో పునరావస కాలనీ నిర్మాణంలో జాప్యం జరుగుతుండడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్వరమే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వెలిగొండ రెండో టన్నెల్ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలన్నారు.

ఇదీ చూడండి:Gellu srinivas: 'నన్ను గెలిపిస్తే మీ పనిమనిషిలా సేవ చేసుకుంటా'

ABOUT THE AUTHOR

...view details