తెలంగాణ

telangana

ETV Bharat / city

రామాయపట్నం పోర్టు నిర్మాణం దిశగా మరో అడుగు - ramayapatnam port tenders news

రామాయపట్నం పోర్టు నిర్మాణం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే టెండర్లను ఆహ్వానించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే టెండర్లను న్యాయ పరిశీలనకు పంపించింది.

రామాయపట్నం పోర్టు నిర్మాణం దిశగా మరో అడుగు
రామాయపట్నం పోర్టు నిర్మాణం దిశగా మరో అడుగు

By

Published : Sep 18, 2020, 9:33 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు టెండర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పరిశీలనకు పంపించింది. ల్యాండ్ లార్డ్ విధానంలో రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... టెండర్లను న్యాయ పరిశీలన ద్వారా సమీక్షించిన అనంతరం జారీ చేయాలని నిర్ణయించింది. పోర్టును అభివృద్ధి చేసేందుకు కాంట్రాక్టు విలువ రూ.2,169 కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది.

3 ఏళ్లలో మొదటి దశ

5.05 కిలోమీటర్ల బ్రేక్ వాటర్స్​తో పాటు 3 అధునాతన బెర్తుల నిర్మాణం కోసం టెండర్లను పిలవాలని ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒక్కో బెర్తును 900 మీటర్ల పొడవుతో బహుళ ఉత్పత్తుల కార్గోను నిర్వహించేలా నిర్మాణం చేపట్టనున్నారు. బాహ్య, అంతర్గత మౌలిక సదుపాయాల నిర్మాణంలో భాగంగా 15.52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేసి పోర్టు వద్ద లోతు తవ్వేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశ పోర్టు నిర్మాణాన్ని 36 నెలల్లో పూర్తి చేయాలని టెండర్లలో పేర్కొన్నారు.

ఈ అంశాలతో కూడిన టెండర్లను సమీక్షించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు న్యాయ పరిశీలనకు పంపింది. దీనిపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలను న్యాయ పరిశీలనకు పంపించాల్సిందిగా ఏపీ మారిటైమ్ బోర్డు కోరింది.

ఇదీ చదవండి:'వాళ్లు జాగా చూపియ్యాలే... మేం అక్కడ ఇండ్లు కట్టియ్యాలే...'

ABOUT THE AUTHOR

...view details