AP letter to KRMB: ఏపీ ఈఎన్సీ తెలిపిన ఆర్డీఎస్ వ్యవహారంలో తెలంగాణకు కేఆర్ఎమ్బీ లేఖ రాసింది. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) కుడి ప్రధాన కాల్వ నిర్మాణం, అందుకు సంబంధించిన కాంపోనెంట్ల పనులు చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించినట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. ఆర్డీఎస్ కుడి ప్రధాన కాల్వ పనుల స్థితిపై తెలంగాణ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ పంపింది.
ఆర్డీఎస్ కాలువ పనులు నిలిపి వేస్తున్నట్లు ఏపీ లేఖ
AP letter to KRMB: రాజోలిబండ డైవర్షన్ స్కీ కుడి కాలువ నిర్మాణం, అందుకు సంబంధించిన పనులను నిలిపివేశామని కేఆర్ఎమ్బీకి ఏపీ ఈఎన్సీ లేఖ రాసింది. అందుకు తగిన ప్రతిని కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు తెలంగాణకు పంపింది.
కేఆర్ఎమ్బీ
కుడి ప్రధాన కాల్వ పనుల (ఆర్డీఎస్) స్థితి గురించి బోర్డు తెలుసుకుందని, కాల్వ నిర్మాణం సహా సంబంధిత పనులు చేపట్టలేదని ఏపీ ఈఎన్సీ నివేదించినట్లు పేర్కొంది. రాజోలిబండ ఆనికట్ కుడివైపు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పాక్షికంగా పూర్తయినట్లుగా ఏపీ చెప్పినట్లు బోర్డు తెలిపింది. తదుపరి నిర్మాణాన్ని చాలా రోజుల క్రితమే నిలిపివేసినట్లు వివరించిందని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. ఏపీ ఈఎన్సీ రాసిన లేఖ ప్రతిని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణకు పంపింది.
ఇవీ చదవండి: