తెలంగాణ

telangana

Sharif on Amaravati : 'నేను రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాను'

By

Published : Mar 4, 2022, 8:53 AM IST

శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు పెట్టాలని చూసినప్పుడు తాను రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాననడానికి.. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనమని ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. నాడు మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నడుచుకున్నానే తప్ప రాజకీయంగా కాదని స్పష్టం చేశారు.

Sharif on Amaravati
Sharif on Amaravati

సీఆర్డీఏ చట్టం రద్దు, 3 రాజధానుల బిల్లులపై తాను సంతకం పెట్టకపోవటంతోనే ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానంలో చిక్కులు ఎదురై, బిల్లుల్ని వెనక్కి తీసుకుందని ఆ రాష్ట్ర శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు పెట్టాలని చూసినప్పుడు తాను రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాననడానికి.. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనమని అన్నారు. బిల్లుల ఆమోదం కోసం తనను ఎన్నో మానసిక ఇబ్బందులకు గురి చేశారని వెల్లడించారు. నాడు మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నడుచుకున్నానే తప్ప రాజకీయంగా కాదంటున్న షరీఫ్‌తో "ఈటీవీ భారత్" ముఖాముఖి...

నేను రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాను: షరీఫ్​

ABOUT THE AUTHOR

...view details