తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2020, 8:35 AM IST

ETV Bharat / city

దిశ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం..

సవరణలతో ప్రవేశపెట్టిన దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. గతంలో ఈ బిల్లును రాష్ట్రం నుంచి కేంద్రం అనుమతి కోసం పంపగా... కేంద్రం కొన్ని సూచనలు చేసింది. కేంద్రం సూచనల మేరకు సవరించి.. శుక్రవారం ఆమోదించారు.

ap-legislature-approves-disha-bill
దిశ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం

ఏపీలో మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, త్వరితగతిన శిక్ష పడటం కోసం ఉద్దేశించిన బిల్లు (దిశ)-2020ను ఆ రాష్ట్ర శాసనసభలో శుక్రవారం ఆమోదించినట్టు పీటీఐ వెల్లడించింది. ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లుకు ఆమోదం లభించిందని తన కథనంలో పీటీఐ పేర్కొంది.

మొదట ఈ బిల్లును ఏపీ శాసనసభ నుంచి కేంద్రం అనుమతి కోసం పంపారు. కేంద్రం కొన్ని మార్పులను సూచించింది. కేంద్రం సూచనల మేరకు సవరించిన బిల్లు శుక్రవారం ఏపీ శాసనసభలో ఆమోదం పొందింది. దీని ప్రకారం మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి జరిగినప్పుడు 7 పనిదినాల్లో విచారణ, 14 పనిదినాల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలి.

ABOUT THE AUTHOR

...view details