ఏపీలో కరోనా కల్లోలం... కొత్తగా 17,354 కేసులు, 64 మరణాలు - ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు
19:14 April 30
ఏపీలో కరోనా కల్లోలం... కొత్తగా 17,354 కేసులు, 64 మరణాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రికార్టు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కొత్తగా 86,494 నమూనాలు పరీక్షించగా.. 17,354 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. ఇంకో 64మందిని వైరస్ బలిగొంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,764 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 2,129, అనంతపురం 1,862,.... తూర్పుగోదావరిలో 1,842, శ్రీకాకుళంలో1,581 కరోనా కేసులు వెలుగుచూశాయి. విశాఖ జిల్లాలో కొత్తగా 1,358, నెల్లూరు జిల్లాలో 1,133, కర్నూలు 967, పశ్చిమగోదావరి 842, కడప 757, విజయనగరం 740, కృష్ణా 698, ప్రకాశం జిల్లాలో 661 మందికి వైరస్ సోకింది.
కరోనాతో నెల్లూరు, విశాఖ జిల్లాల్లో 8 మంది చొప్పున చనిపోగా.. విజయనగరం జిల్లాలో ఏడుగురు, చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం జిల్లాలో ఐదుగురు చొప్పున మరణించారు. గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున చనిపోయారు. రాష్ట్రంలో మరో 8,468 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,22,980 యాక్టివ్ కేసులున్నట్లు.. ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు