AP CORONA CASES:ఆంధ్రప్రదేేశ్లోకరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,495 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 1,166 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 9,632 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 32,413 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ కారణంగా కొత్తగా మరో ఐదుగురు మరణించినట్లు పేర్కొంది.
ఏపీలో కొత్తగా 1,166 కరోనా కేసులు, 5 మరణాలు Corona cases in India: దేశంలోనూ కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 58,077 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 657మంది ప్రాణాలు కోల్పోయారు. 1,50,407 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.64 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.17 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు:4,25,36,137
- మొత్తం మరణాలు:5,07,177
- యాక్టివ్ కేసులు:6,97,802
- మొత్తం కోలుకున్నవారు:4,13,31,158
దేశంలో కొత్తగా 48,18,867 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,71,79,51,432 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World Corona Cases:ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 24,18,983 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 10,862 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 40.63 కోట్లు దాటగా.. మరణాల సంఖ్య 58,08,798కు చేరింది.
- జర్మనీలో మరో 2,47,128 మంది వైరస్ బారినపడ్డారు. మరో 224 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో ఒక్కరోజే 1,79,237 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 2,465 మంది మృతిచెందారు.
- రష్యాలో కొత్తగా 1,97,076 మందికి కరోనా సోకింది. 701 మంది మరణించారు.
- టర్కీలో తాజాగా 98,602 కేసులు బయటపడగా.. 264 మంది బలయ్యారు.
- బ్రెజిల్లో ఒక్కరోజే 1,65,359 మందికి వైరస్ సోకింది. మరో 922 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి:దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నా: సీఎం కేసీఆర్