AP Inter Exams: అరకొర వసతుల మధ్య శుక్రవారం నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో చాలాచోట్ల కనీస సదుపాయాలు లేవు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా గదుల కొరత పేరుతో కొన్ని ప్రాంతాల్లో రేకుల షెడ్లలో కేంద్రాలను ఏర్పాటుచేశారు. అక్కడ కనీసం ఫ్యాన్లూ ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులకు ఉక్కపోత బాధలు తప్పవు. ప్రయోగశాలలనూ పరీక్ష కేంద్రాలుగా మార్చేశారు. కొన్నిచోట్ల బెంచీలు, డెస్క్‌లు లేకపోవడంతో విద్యార్థులు కూర్చునేందుకు స్టూళ్లను ఏర్పాటు చేశారు. వాటిపై కూర్చుని ఒళ్లో ప్యాడ్ పెట్టుకుని 3గంటలపాటు పరీక్షల రాయాలంటే పిల్లలకు నడుం విరిగినంత పనవుతుంది.
ప్రయాణ ప్రయాస
నగరాలు, పట్టణాలు, మన్యం ప్రాంతం అని లేకుండా చాలాచోట్ల 10 నుంచి 44 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయమే పరీక్ష ఉండటంతో ట్రాఫిక్ రద్దీలో విద్యార్థులు వెళ్లడం కత్తిమీద సామే అవుతుంది. మరికొన్ని చోట్ల పొలాల మధ్యలో పరీక్ష కేంద్రాలు ఉండటంతో.. అక్కడకు చేరుకోవడమే చాలా కష్టం కానుంది.
కనీస సదుపాయాలూ కరవే..