Inter exams postponed in AP : ఏపీలో ఇంటర్ పరీక్షలు మరోసారి వాయిదా పడనున్నాయి. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలను ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సవరించిన షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేయడమే ఇందుకు కారణం. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహిస్తామని ఇప్పటికే ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులు రెండు పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధమవడం కష్టంగా మారుతుంది. ఇంటర్ పరీక్షల మార్పు నేపథ్యంలో పదో తరగతి షెడ్యూల్ సైతం మారేలా ఉంది.
AP Inter exams postponed: ఇంటర్ పరీక్షలు మరోసారి వాయిదా..!
Inter exams postponed in AP : ఏపీలో ఇంటర్ పరీక్షలు మరోసారి వాయిదా పడనున్నాయి. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను ఎన్‌టీఏ సోమవారం విడుదల చేయడమే ఇందుకు కారణం. ఇంటర్ పరీక్షల మార్పు నేపథ్యంలో పదో తరగతి షెడ్యూల్ మారేలా ఉంది.
Inter exams postponed in AP
ఇదీ జేఈఈ మెయిన్ కొత్త షెడ్యూల్
విద్యార్థుల విన్నపం మేరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల షెడ్యూల్‌ను సవరించినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. వీటిని ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహిస్తారు. రెండో విడత పరీక్షలు మే 24 నుంచి 29 వరకు ఉంటాయి. హాల్‌టికెట్లను ఏప్రిల్ రెండో వారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.