ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారంటూ... దాఖలైన పిటిషన్పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే.. అసలు సహించేది లేదని.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో గ్రామానికి చెందిన వెంకటరాజు అనే వ్యక్తిని పోలీసులు అపహరించారంటూ.. అతడి మేనమామ నారాయణ స్వామి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వెంకట్రాజును పోలీసులు తీసుకెళ్లారంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లపై రేపు విచారణ జరపనుంది.
ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదు. వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే.. ఎట్టిపరిస్థితుల్లో సహించబోం. గతంలో డీజీపీ కోర్టు ఎదుట హాజరైనా.. పరిస్థితిలో మార్పు రాలేదు.
-హైకోర్టు