తెలంగాణ

telangana

ETV Bharat / city

నిధుల కోసం.. ఎస్​ఈసీ పిటిషన్​పై తీర్పు రిజర్వ్ - నిధులు విడుదలపై ఏపీ ఈసీ పిటిషన్

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈసీకి ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదని ఎన్నికల కమిషనర్ పిటిషన్‌ వేశారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్‌లో ఉంచింది.

నిధుల కోసం.. ఎస్​ఈసీ పిటిషన్​పై తీర్పు రిజర్వ్
నిధుల కోసం.. ఎస్​ఈసీ పిటిషన్​పై తీర్పు రిజర్వ్

By

Published : Oct 22, 2020, 10:45 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం నిధులు విడుదలపై ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. గత విచారణలో రాజ్యాంగ సంస్థలకు సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: కల్వకుర్తి ఎత్తిపోతలపై భవిష్యత్​ కార్యాచరణకు టీపీసీసీ సబ్​కమిటీ

ABOUT THE AUTHOR

...view details