తెలంగాణ

telangana

ETV Bharat / city

Anandayya Medicine: ఆనందయ్య 'కె' మందుకు హైకోర్టు అనుమతి - ఆనందయ్య ఔషదం అప్​డేట్స్

ఆనందయ్య ‘కె’ మందుకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ రకం మందును నిలుపుదల చేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ...కరోనా బాధితులకు తక్షణమే ‘కె’ మందు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Anandayya Medicine
Anandayya Medicine

By

Published : Jun 7, 2021, 2:21 PM IST

ఏపీ నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ఇస్తున్న ఔష‌ధాల్లో ఒక‌టైన ‘కె’ మందుకు.. ఆ రాష్ట్ర హైకోర్టు అనుమ‌తిచ్చింది. గ‌తంలో ఆనంద‌య్య ఇత‌ర మందుల‌కు అనుమ‌తిచ్చిన ప్ర‌భుత్వం.. కంట్లో వేసే చుక్క‌ల మందు సహా ‘కె’ మందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఆయుష్ నివేదికకు సంబంధించి పూర్తి వివ‌రాలు రాని నేప‌థ్య‌లో వీటికి అనుమ‌తి దక్కలేదు.

ఈ నేప‌థ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. క‌రోనా బాధితుల‌కు త‌క్ష‌ణ‌మే ‘కె’ మందు పంపిణీ చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. కంటి చుక్క‌ల మందుకు సంబంధించి 2 వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని ధ‌ర్మాస‌నం ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడింది.

ఇదీ చదవండి:Anandaiah Medicine: 'అనుమతులే తప్ప సహకారం లేదు'

ABOUT THE AUTHOR

...view details