తెలంగాణ

telangana

ETV Bharat / city

HC on Movie Tickets Issue : 'సర్కారీ వేదికపై సినిమా టికెట్ల అమ్మకానికి సరే' - High Court news

HC on Movie Tickets Issue:: మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు సొంత వేదికపై సినిమా టికెట్లను విక్రయించుకునేందుకు ప్రస్తుతం అనుమతి ఇవ్వలేమని ఏపీ హైకోర్టు స్పష్టంచేసింది . ప్రభుత్వం ఏపీ స్టేట్ , ఫిల్మ్ , కార్పొరేషన్ ద్వారా టికెట్ల విక్రయానికి తీసుకొచ్చిన విధానం ఎలా సాగుతుందో కొంతకాలం వేచి చూద్దామని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన వేదిక ద్వారా టికెట్లను విక్రయించుకోవచ్చని తెలిపింది. మల్టీఫ్లెక్స్‌ల అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామని వెల్లడించింది

HC on Movie Tickets Issue: సర్కారీ వేదికపై సినిమా టికెట్ల అమ్మకానికి సరే
HC on Movie Tickets Issue: సర్కారీ వేదికపై సినిమా టికెట్ల అమ్మకానికి సరే

By

Published : May 6, 2022, 1:08 PM IST

HC on Movie Tickets Issue : మల్టీప్లెక్స్‌ థియేటర్ల యాజమాన్యాలు సొంత వేదికపై సినిమా టికెట్లను విక్రయించుకునేందుకు ప్రస్తుతం అనుమతివ్వలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ స్టేట్‌, ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) ద్వారా విక్రయానికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఎలా సాగుతుందో కొంతకాలం వేచిచూద్దామని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన వేదిక ద్వారా టికెట్లను విక్రయించుకోవచ్చని తెలిపింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

మల్టీప్లెక్స్‌ల అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామంటూ.. జులై 12కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించేందుకు వీలుగా 2021 డిసెంబర్‌ 17న జారీ చేసిన జీవో 142ను సవాలు చేస్తూ ‘మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ తరఫున మంజీత్‌సింగ్‌, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details