తెలంగాణ

telangana

ETV Bharat / city

AP High Court On Cinema Theater : 'సినిమా థియేటర్​ను మూసే అధికారం తహసీల్దార్​కు లేదు' - AP high court on cinema theater lock

AP High Court On Cinema Theater : సినిమా థియేటర్​కు తహసీల్దార్ తాళం వేయడాన్ని తప్పుపట్టిన ఏపీ హైకోర్టు.. థియేటర్​ను తెరవాలని తహసీల్దార్​ను ఆదేశించింది. విజయనగరం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్​ను మూసివేయడాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన వ్యాజ్యంపై ఈ మేరకు తీర్పునిచ్చింది.

AP High Court On Theater Lock
AP High Court On Theater Lock

By

Published : Feb 8, 2022, 7:11 AM IST

AP High Court On Cinema Theater : నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని.. సినిమా థియేటర్​కు ఓ తహసీల్దార్​ తాళం వేయడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. ఆ అధికారం తహశీల్దార్​కు లేదని స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న సంయుక్త కలెక్టర్.. అధికారమిచ్చిన వ్యక్తికి మాత్రమే తాళం వేసే అధికారం ఉంటుందని తెలిపింది. ప్రస్తుత విషయంలో సంయుక్త కలెక్టర్.. తహసీల్దార్​కు ఆ అధికారం ఇవ్వలేదని గుర్తుచేసింది. థియేటర్​ను తెరవాలని తహసీల్దార్​ను న్యాయస్థానం ఆదేశించింది. లెసైన్స్ పునరుద్ధరణ వ్యవహారం అధికారుల వద్ద ఉన్న నేపథ్యంలో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.

AP High Court On Cinema Theater Issue : ఏపీలోని విజయనగరం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్​ను తహసీల్దార్ మూసివేయడాన్ని సవాలు చేస్తూ.. మేనేజింగ్ పార్టనర్ ఎస్.శంకరరావు ఆ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్​ వ్యవహరించారని చెప్పారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. థియేటర్​కు వేసిన తాళాన్ని తీయాలని తహసీల్దార్​ను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details