తెలంగాణ

telangana

ETV Bharat / city

AP High Court On TTD Board: తితిదే బోర్డు సభ్యుల నియామకం.. వారిపై హైకోర్టు ఆగ్రహం - తితిదే బోర్డు సభ్యుల నియామకం తాజా వార్తలు

AP High Court On TTD Board: నేర చరిత్ర ఉన్నవారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించారని భాజపా నేత భాను ప్రకాశ్ రెడ్డి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ విచారణ జరిగింది. బోర్డు సభ్యుల్లో 18 మంది నేర చరిత్ర ఉన్నవాళ్లేనని వారిలో 16 మంది సభ్యులు ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కౌంటర్ దాఖలు చేయకపోవటంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 11లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

AP High Court On TTD Board
తితిదే బోర్డు సభ్యుల నియామకం

By

Published : Feb 22, 2022, 5:22 PM IST

AP High Court On TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 52 మందిని సభ్యులుగా నియమించామని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. కాగా.. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆర్డినెన్స్​పై పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్​కు హైకోర్టు సూచించింది.

బోర్డు సభ్యుల్లో 18 మంది నేర చరిత్ర ఉన్నవాళ్లేనని.. వారిలో 16 మంది సభ్యులు ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కౌంటర్ దాఖలు చేయకపోవటంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 11 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. లేదంటే నేరుగా విచారణ ప్రారంభిస్తామని హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి :Husband Complaint To HRC On Wife: భార్య నుంచి ప్రాణహాని ఉంది.. హెచ్​ఆర్సీకి ఓ భర్త మొర

ABOUT THE AUTHOR

...view details