తెలంగాణ

telangana

ETV Bharat / city

new bar policy in AP : మద్యం పాలసీ జోవోపై స్టేకు ఏపీ హైకోర్టు నిరాకరణ

new bar policy in AP : ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బార్‌ పాలసీ-2022, తదనుగుణంగా జారీ చేసిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో.. ఆ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

new bar policy
new bar policy

By

Published : Jul 27, 2022, 12:07 PM IST

new bar policy in AP : ఏపీప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బార్‌ పాలసీ-2022, తదనుగుణంగా జారీ చేసిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో.. ఆ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని పిటిషనర్లకు స్పష్టం చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నూతన బార్‌ పాలసీని సవాలు చేస్తూ 516 మంది బార్‌ యజమానులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. మద్యం వ్యాపారంలో ఏ వ్యాపారీ నష్టపోరని వ్యాఖ్యానించింది.

ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమంది. మద్యం వ్యవహారంలో న్యాయస్థానాలు అరుదుగా జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్యానించింది. బార్‌ లైసెన్సులను న్యాయస్థానాలు ఇవ్వలేవంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details