తెలంగాణ

telangana

ETV Bharat / city

Social media posts against Judges case: ట్విటర్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌కు ఏపీ హైకోర్టు ఆదేశాలు - ఏపీ న్యాయమూర్తుల కేసు

Social media posts against Judges case : న్యాయమూర్తులు, కోర్టులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతర వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ, రిజిస్ట్రార్‌ జనరల్‌ లేఖలకు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించింది. ఇకపై ఆదేశాలు పాటించాలని.. ట్విటర్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Social media posts against Judges case, ap judges case
ట్విటర్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌కు ఏపీ హైకోర్టు ఆదేశాలు

By

Published : Jan 25, 2022, 5:06 PM IST

Social media posts against Judges case : న్యాయమూర్తులు, కోర్టులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతర వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ, రిజిస్ట్రార్‌ జనరల్‌ లేఖలకు ఎందుకు స్పందించట్లేదని.. సంబంధిత సంస్థలను కోర్టు ప్రశ్నించింది. సోషల్‌ మీడియాలో పోస్టులు తొలగించాలని లేఖ రాశామని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. లేఖ రాసినా ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ పట్టించుకోవట్లేదని ధర్మాసనానికి నివేదించారు.

ఇదే సమయంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ లేఖకూ స్పందించకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఉన్నత న్యాయస్థానం.. సీబీఐ లేఖను కోర్టు ఉత్తర్వులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఇకపై ఆదేశాలు పాటించాలని.. ట్విటర్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details