తెలంగాణ

telangana

ETV Bharat / city

కృష్ణాయపాలెం రైతుల బెయిల్ పిటిషిన్ రేపటికి వాయిదా - కృష్ణాయపాలెం రైతుల బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు

ఏపీలోని కృష్ణాయపాలెం రైతులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

కృష్ణాయపాలెం రైతుల బెయిల్ పిటిషిన్ రేపటికి వాయిదా
కృష్ణాయపాలెం రైతుల బెయిల్ పిటిషిన్ రేపటికి వాయిదా

By

Published : Nov 10, 2020, 7:24 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పీఎస్​లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే విషయాలేవీ పేర్కొనలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:ఈవీఎంల ట్యాంపరింగ్​ అసాధ్యం: ఈసీ

ABOUT THE AUTHOR

...view details