తెలంగాణ

telangana

ETV Bharat / city

MP Raghurama: అట్రాసిటీ కేసులో ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట - రఘురామకు హైకోర్టులో ఊరట

Atrocity case on MP Raghurama: అట్రాసిటీ కేసులో ఏపీ ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని.. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Atrocity case on MP Raghurama
రఘురామకు హైకోర్టులో ఊరట

By

Published : Feb 14, 2022, 8:02 PM IST

Atrocity case on MP Raghurama: ఆంధ్రప్రదేశ్​ ఎంపీ రఘురామ పిటిషన్లపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. ఎస్సీలను దూషించారని చింతలపూడి పీఎస్‌లో రఘురామపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును సవాల్ చేస్తూ ఎంపీ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. అనుచిత వ్యాఖ్యలు చేయకుండానే కేసు నమోదు చేశారని రఘురామ తరపు లాయర్ వాదించారు. సాక్ష్యాధారాలు లేకుండా కేసు పెట్టారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

వాదనలు విన్న ధర్మానసం.. ఎస్సీ, ఎస్టీ కేసులో తదుపరి చర్యలు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:Night Curfew Lifted: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details