తెలంగాణ

telangana

ETV Bharat / city

Anandaiah Petition in AP High Court : ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్.. నేడు విచారణ

AP High Court on Anandaiah Medicine : కొవిడ్​ నిరోధానికి ఔషధ పంపిణీలో పోలీసుల జోక్యాన్ని నిలువరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య.. ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అనందయ్య వ్యాజ్యంపై నేడు కోర్టు విచారణ జరపనుంది.

By

Published : Dec 31, 2021, 8:25 AM IST

AP high court
AP high court

AP High Court on Anandaiah Medicine : కొవిడ్​ నిరోధానికి మందును తీసుకునేందుకు తన ఇంటికి వస్తున్న ప్రజలు, బాధితులను పోలీసులు అడ్డుకుంటున్నారని.. ఔషధ పంపిణీ విషయంలో వారి జోక్యాన్ని నిలువరించేలా ఆదేశాలు ఇవ్వాలని నెల్లూరు జిల్లా కృష్ణపట్టణం వాసి, ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య.. ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం విచారణ ప్రారంభం కాగానే ఆయన తరపు న్యాయవాది వ్యాజ్యంపై అత్యవసర విచారణకు అనుమతించాలని కోరారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ స్పందిస్తూ .. శుక్రవారం విచారణ చేస్తామన్నారు. ఏపీ హోం శాఖ ముఖ్యకార్యదర్శి, నెల్లూరు ఎస్పీ, డీఎస్పీ, కృష్ణపట్నం పోలీసులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Anandaiah Medicine Controversy :కొత్త వేరియంట్ ఒమిక్రానుకు మందు ఇస్తున్నానంటూ.. కొందరు చేసిన ప్రచారం వాస్తవం కాదని అధికారులకు బదులిచ్చామని పిటిషన్​లో పేర్కొన్నారు. ఆ వివరాలను పట్టించుకోకుండా పోలీసు కానిస్టేబుళ్లను తన ఇంటి ముందు ఉంచారని తెలిపారు. ఆయుర్వేద మందు కోసం వస్తున్న వారిని అడ్డుకుంటున్నారని చెప్పారు. ఔషధ పంపిణీని అడ్డుకోవడం చట్ట విరుద్ధం అన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పోలీసుల జోక్యాన్ని నిలువరించాలని కోరారు. తనకు తగిన పోలీసు భద్రత కల్పిస్తూ.. మందు పంపిణీ సేవ సజావుగా జరిగేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టును విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details