తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ పీఆర్సీపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ, ఆ 12 మందికి నోటీసులు - పీఆర్సీ పిటిషన్​పై ఏపీ హైకోర్టు

AP High Court on Petition Against PRC : పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలపగా.. పిటిషనర్​తోపాటు 12 సంఘాల నేతలు కోర్టులో హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు పిటిషన్ విచారించే రోస్టర్​లో తమ బెంచ్​ లేదని.. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తికి పంపుతున్నామని తెలిపింది.

AP high court on PRC GO
AP high court on PRC GO

By

Published : Jan 24, 2022, 3:53 PM IST

AP High Court on Petition Against PRC : ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రవితేజ కోర్టుకు తెలిపారు. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్ధమని అన్నారు. హెచ్‌ఆర్‌ఏ విభజన చట్టప్రకారం జరగలేదని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు.

AP High Court on PRC Issue :ఈ క్రమంలో కోర్టు ఎదుట హాజరుకావాలని పిటిషనర్‌తో పాటు 12 సంఘాల నేతలను ధర్మాసనం ఆదేశించింది. అనంతరం విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తిరిగి విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ విచారించే రోస్టర్‌లో తమ బెంచ్ లేదని వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజనం, వ్యక్తిగత పిటిషన్‌ వల్ల నిర్ణయాధికారం తమకు లేదని స్పష్టం చేసింది. పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తికి పంపుతున్నామని వెల్లడించింది. ఈ పిటిషన్‌తో ఏపీలో అందరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details