ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ ప్రవేశాలపై ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ఆన్‌లైన్ ప్రవేశాలపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. సరైన విధానాన్ని ప్రకటించలేదని తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆన్‌లైన్ అడ్మిషన్స్.. రెండు విడతల్లో
ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రెండు దశల్లో దరఖాస్తులను స్వీకరించింది. మొదటి విడతలో ఆగస్టు 27వరకు గడువు ఇచ్చారు. రెండో విడుతలోనూ ప్రవేశాలను ప్రారంభించిన ఇంటర్ బోర్డు.. నవంబర్ 6వరకు తుది గడువుగా ప్రకటించింది. అయితే సరైన విధివిధానాలు లేకుండానే ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫకేషన్ ఇచ్చారని పేర్కొంటూ.. పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన న్యాయస్థానం.. ఇంటర్ బోర్డు ఇచ్చిన ఆన్‌లైన్ ప్రవేశాల నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
ఇదీ చదవండి :huzurabad by election: నిరుద్యోగులతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త వ్యూహం