ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై ఈ నెల 10 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఆన్‌లైన్ ద్వారా ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం... ఈ మేరకు ఆదేశించింది. ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు జరిపితే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అడ్మిషన్ల ప్రక్రియలో నిబంధనలు పాటించట్లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఏపీలో ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే - ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్స్ వార్తలు
ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ ద్వారా ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారించిన ఆ రాష్ట్ర హైకోర్టు... స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే
ఏ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు ఆన్లైన్లో చేపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది సమయం కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తూ... ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.