పాఠశాల ఆవరణలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణకు... నలుగురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలు పాటించలేదని ఆ నలుగురు ఐఏఎస్‌లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లాల్లోని పలు పాఠశాలల ఆవరణలో భవనాలు కట్టడంపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు విచారణ జరిపింది. ఐఏఎస్‌లు ద్వివేది, గిరిజాశంకర్, శ్రీలక్ష్మి, విజయ్‌కుమార్ విచారణకు హాజరయ్యారు.
AP High Court: మా ఆదేశాల అమల్లో జాప్యమెందుకు?: ఏపీ హైకోర్టు - andhrapradesh news
ఏపీ కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు నలుగురు ఐఏఎస్‌లు జీకే ద్వివేది, గిరిజాశంకర్, శ్రీలక్ష్మి, విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఆ పాఠశాలల ఆవరణలో ఎలాంటి భవనాలు నిర్మించొద్దని గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు పాటించలేదని హైకోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాఠశాల ఆవరణలో భవనాలు కట్టవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాము ఆదేశించినా పట్టించుకోలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారని.. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భవనాల నిర్మాణం నిలిపివేయాలని తాము ఆదేశించినట్లు ఐఏఎస్ అధికారులు తెలిపారు. తదుపరి విచారణకు నలుగురు ఐఏఎస్‌లు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 30కు వాయిదా పడింది.
ఇదీ చదవండి:NGT Fire on AP Govt: ఏపీ సర్కారుపై ఎన్జీటీ ఫైర్... ప్రాజెక్టుల నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు