తెలంగాణ

telangana

ETV Bharat / city

AP High Court Fire On State Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం - తెలంగాణ వార్తలు

AP High Court Fire On State Govt : ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టట్లేదని ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని జీవోల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

AP High Court Fire On State Govt, andhra pradesh high court
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

By

Published : Dec 22, 2021, 5:38 PM IST

AP High Court on Hiding State Govt GO's: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టట్లేదని ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై ధర్మాసనం మండిపడింది. అన్ని జీవోల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది. జీవోల అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ తీరు.. సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని, ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోల్లో 5 శాతమే వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది.. అతి రహస్య జీవో మాత్రమే అప్‌లోడ్‌ చేయట్లేదని కోర్టుకు తెలిపారు.

AP High court on Hiding GOs: ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. జీవోలు రహస్యం, అతిరహస్యమని ఎలా నిర్ణయిస్తారని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అన్ని జీవోల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించిన హైకోర్టు.. వెబ్‌సైట్‌లో ఉంచిన, రహస్య జీవోల వివరాలు తెలపాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి :'21 ఏళ్లలోపు వారి పెళ్లికి హైకోర్టు నో.. సహజీవనానికి ఓకే!'

ABOUT THE AUTHOR

...view details