తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏలూరులో ఎన్నికలు జరుపుకోవచ్చు: ఏపీ హైకోర్టు - ap muncipal elections 2021

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్​లో ఎన్నికల నిర్వహణకు ఆ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ap-high-court-division-bench-green-signal-to-elections-conduct-in-eluru-municipality
ఏలూరులో ఎన్నికలు జరుపుకోవచ్చు: ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్‌

By

Published : Mar 9, 2021, 6:23 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్​లో ఎన్నికల నిర్వహణకు ఆ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ఎన్నికలు జరుపుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏలూరు ఎన్నికల పై సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.

ఆఖరి నిమిషంలో ఎన్నికల రద్దు సరికాదని పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ప్రభుత్వంతో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 23కి హైకోర్టు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details