తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోని విద్యుత్తు విభాగం ఈ-టెండర్ల ప్రక్రియ రద్దుకు దాఖలైన రిట్‌పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. టెండరు ప్రక్రియ విధానం వల్ల పారదర్శకత ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు అభిప్రాయపడ్డారు.
ఈ-టెండర్ల ప్రక్రియ రద్దుకు దాఖలైన రిట్‌పిటిషన్ కొట్టివేత - tirupathi news
తితిదే విద్యుత్ విభాగం ఈ-టెండర్ల ప్రక్రియ వల్ల పారదర్శకత ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ-టెండర్ల ప్రక్రియ రద్దుకు దాఖలైన రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
![ఈ-టెండర్ల ప్రక్రియ రద్దుకు దాఖలైన రిట్‌పిటిషన్ కొట్టివేత ap high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9751126-785-9751126-1606997230121.jpg)
ap high court
మొత్తం 53 మంది కార్మికులు వారి వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్బిటరేషన్ ద్వారా తమ వాదన వినిపించుకోవాలని కార్మికులకు సూచించినట్లు... తితిదే స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు మజ్జి సూరిబాబు తెలిపారు.
ఇదీ చదవండి :జాతీయ ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా జమ్మికుంట ఠాణా