ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. ఎస్‌ఈసీ ఆదేశాలను నిలిపివేయాలని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంను హైకోర్టు తోసిపుచ్చింది. స్థానిక ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో చర్చించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం మరోసారి ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ఆదేశాలు అందిన మూడు రోజుల్లో ముగ్గురు అధికారులను ఎస్‌ఈసీ వద్దకు పంపించాలని పేర్కొంది.
ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు - ఏపీ హైకోర్టు వార్తలు
ఏపీ స్థానిక ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో చర్చించాలని... ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ఆదేశాలు అందిన మూడు రోజుల్లో ముగ్గురు అధికారులను ఎస్‌ఈసీ వద్దకు పంపించాలని నిర్దేశించింది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
ap sec issue
ఇందుకోసం ఎన్నికల కమిషనే వేదికను నిర్ణయించాలని సూచించింది. ఈ భేటీలో ఎన్నికల నిర్వహణపై ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వ అధికారులు.. ఎస్‌ఈసీ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఎస్‌ఈసీ వివరించాలని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది.
ఇదీ చదవండి:సీమలో అలజడి... తెదేపా నేత దారుణ హత్య