తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ వాహనాల విడుదలపై డీజీపీ కోర్టుకు హాజరుకావాలి : ఏపీ హైకోర్టు - అక్రమ మద్యం రవాణా సీజ్ వాహనాల వార్తలు

అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. డీజీపీని కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ap high court
ap high court

By

Published : Jun 23, 2020, 4:55 PM IST

అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించట్లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాహనాల విడుదలపై ప్రభుత్వ న్యాయవాది వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. ఏపీ డీజీపీ కోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

హెబియస్‌ కార్పస్‌ కేసుకు సంబంధించిన విచారణ కోసం గతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు. తమను అక్రమంగా అరెస్టు చేశారని గతంలో రెడ్డి గౌతమ్‌, ఎల్లేటి లోచి అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో డీజీపీ హైకోర్టుకు హాజరయ్యారు.. ఇప్పుడు మరోసారి ధర్మాసనం కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:అమెజాన్​లోనూ ఇక మద్యం హోం డెలివరీ!

ABOUT THE AUTHOR

...view details