తెలంగాణ

telangana

ETV Bharat / city

HIGH COURT ON TTD MEMBERS: 'నేర చరిత్ర ఉన్నవారిని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారు..?' - ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం న్యూస్

HIGH COURT ON TTD MEMBERS: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేర చరితులను బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అందరినీ కాకపోయినా.. కొందరినైనా తొలగించాలని ఆదేశించింది.

HIGH COURT: 'నేర చరిత్ర ఉన్నవారిని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారు..?'
HIGH COURT: 'నేర చరిత్ర ఉన్నవారిని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారు..?'

By

Published : Mar 31, 2022, 5:15 PM IST

HIGH COURT ON TTD MEMBERS: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో.. నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేర చరితులను తితిదే బోర్డు సభ్యులుగా నియమించడాన్ని భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి.. ఆ రాష్ట్ర హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. నేర చరితులను బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది.

పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు భావిస్తున్నామని తెలిపింది. అందరినీ కాకపోయినా.. కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేర చరితులు పాలకవర్గంలో ఉండరాదన్న హైకోర్టు.. ఏప్రిల్‌ 19న కేసు వాదనలు వింటామని.. అదే రోజు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్న ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 19కి వేయిదా వేసింది.

ఇదీ చదవండి: Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కానీ

ABOUT THE AUTHOR

...view details