తెలంగాణ

telangana

ETV Bharat / city

హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్న పిటిషన్‌పై మళ్లీ విచారణ - ap high court red zone news

ఏపీ హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్న పిటిషన్‌పై మళ్లీ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ పునఃప్రారంభించాలని జడ్జి రామకృష్ణ చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. ఇంప్లీడ్ పిటిషన్​లో ఒక పేరాపై కౌంటర్​ దాఖలుకు ప్రభుత్వానికి గడువునిచ్చింది.

ap high court
ap high court

By

Published : Aug 11, 2020, 7:54 PM IST

ఏపీ హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ మరణంపై విచారణ కోరుతూ జడ్జీ రామకృష్ణ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్​పై మరోసారి విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి సోమవారమే వాదనలు ముగించి హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. అయితే విచారణ పునఃప్రారంభించాలని జడ్జి రామకృష్ణ హైకోర్టును అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం... జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్​లో ఒక పేరాపై కౌంటర్​ దాఖలుకు ప్రభుత్వానికి గడువునిచ్చింది. గురువారం లోపు కౌంటర్​ దాఖలు చేయాలని ఆదేశించింది.

కౌంటర్ దాఖలు చేస్తాం

ఇంప్లీడ్ పిటిషన్ లోని కొన్ని అంశాలపై కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గురువారం వరకు హైకోర్టు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. జడ్జి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేసే సమయానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి ఫెడరేషన్ ప్రతినిధి లక్ష్మీనర్సయ్య వేసిన ఒరిజనల్ పిటిషన్​పై విచారణ పూర్తి చేసి తీర్పుని ధర్మాసనం రిజర్వ్ చేసింది .

ABOUT THE AUTHOR

...view details