తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ: అనిశా కేసుపై విచారణ రేపటికి వాయిదా - ఏపీ రాజధాని భూములు

ఏపీ రాజధాని భూములపై అవినీతి నిరోధకశాఖ (అనిశా) నమోదు చేసిన కేసు విచారణను..ఏపీ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కౌంటరు దాఖలుకు మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఈ కేసులో కౌంటర్‌ వేయవచ్చని తెలిపింది.

ఏపీ: అనిశా కేసుపై విచారణ రేపటికి వాయిదా
ఏపీ: అనిశా కేసుపై విచారణ రేపటికి వాయిదా

By

Published : Sep 24, 2020, 12:30 PM IST

ఏపీ రాజధాని భూములపై అవినీతి నిరోధకశాఖ (అనిశా) నమోదు చేసిన కేసు విచారణను..ఏపీ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఈనెల 15న జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలని, తానూ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది మమతారాణి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు.

కౌంటరు దాఖలుకు మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వం కూడా కౌంటర్‌ వేయవచ్చని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి బుధవారం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.

ఇదీ చదవండి:ప్రజల సౌలభ్యం కోసం తెలుగులో ప్రభుత్వ సమాచారం

ABOUT THE AUTHOR

...view details