AP HC on New Districts: కొత్త జిల్లాల పెంపు వ్యవహారంపై.. ఆంధ్రప్రదేస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుది ప్రకటన వెలువడని దృష్ట్యా.. మధ్యంతర ఉత్తర్వులకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
తుది ప్రకటన రాలేదు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం: ఏపీ హైకోర్టు - కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు
AP HC on New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త జిల్లాలపై తుది ప్రకటన రానందున మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనంతరం తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ముసాయిదా ప్రకటన రద్దు చేయాలంటూ.. హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ.. గుంటూరు జిల్లా అప్పాపురం గ్రామానికి చెందిన దొంతినేని విజయ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ముసాయిదా జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ వ్యాజ్యంపై ఇవాళ విచారణ చేపట్టింది.
ఇదీ చదవండి:BJP MLAs appeal to Telangana High Court bench : సస్పెన్షన్‌పై హైకోర్టు ధర్మాసనానికి భాజపా ఎమ్మెల్యేల అప్పీల్