తెలంగాణ

telangana

ETV Bharat / city

'తితిదే ఆస్తుల వివరాలు అఫిడవిట్ రూపంలో సమర్పించండి' - తితిదే ఆస్తులు తాజా వార్తలు

తితిదే ఆస్తులను కాపాడే విధంగా దేవస్థానం పాలకమండలికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. తితిదే తీర్మానాలు, వెబ్​సైట్​లో పొందుపరిచిన మొత్తం వివరాలు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించిన న్యాయస్థానం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ap-hc-on-tirumala-assets-petition
అఫిడవిట్ రూపంలో తితిదే ఆస్తుల వివరాలు

By

Published : Feb 26, 2021, 8:48 AM IST

శ్రీవారి ఆస్తుల పరిరక్షణ కోసం పలు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ హైకోర్టుకు తితిదే నివేదించింది. అందులో భాగంగా గత డిసెంబరు 12న విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ శ్రీథరావు, జస్టిస్ ఎం.సీతారామమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తితిదేకి సంబంధించిన ఆస్తుల వివరాలను అధికారిక వెబ్​సైట్​లో గతేడాది నవంబర్ 28న పొందుపరిచామని తితిదే తరఫు న్యాయవాది ఎ.సుమంత్ న్యాయస్థానికి వెల్లడించారు. ఆస్తుల రక్షణ కోసం తితిదే తీర్మానాలు చేసిందన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తీర్మానాలు, వెబ్​సైట్​లో ఉంచిన ఆస్తుల వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

తితిదేకు చెందిన ఆస్తుల వేలాన్ని నిలువరించాలని కోరుతూ.. భాజపా నేత అమర్నాథ్ గతేడాది ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ.. శ్రీవారి ఆస్తులు, భక్తులు ఇచ్చిన విరాళాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తితిదే కౌంటర్ అఫిడవిట్ వేసిందని గుర్తుచేశారు. శ్రీవారి ఆస్తుల రక్షణ కోసం తగిన ఆదేశాలివ్వాలని కోరారు. భక్తులు సమర్పించిన కానుకలు, ఆస్తుల విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయన్నారు. ఓ విషయంలో తితిదే పరువునష్టం దావా వేసిందని గుర్తుచేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. వ్యాజ్యంలోని అంశాలకే పరిమితమై వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. వివరాలు సమర్పించాలని తితిదే న్యాయవాదిని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details