తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Govt To Impose ESMA: ఏపీ ఉద్యోగుల సమ్మెపై 'ఎస్మా' ప్రయోగం.! - ఏపీ తాజా వార్తలు

AP Govt To Impose ESMA: ఏపీలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల చేస్తున్న సమ్మెను ఆపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా వారిపై ఎస్మా చట్టం ప్రయోగించే యోచనలో ఉంది. ఉద్యోగులు సమ్మెకు వెళితే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలపై సీఎస్ సమీర్​ శర్మ సమీక్షించారు.

AP Govt To Impose ESMA
ఏపీ ఉద్యోగుల సమ్మెపై ఎస్మా ప్రయోగం

By

Published : Feb 4, 2022, 7:55 PM IST

AP Govt To Impose ESMA: ఆంధ్రప్రదేశ్​లో ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా నిరోధించేందుకు 'ఎస్మా' ప్రయోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై సాధారణ పరిపాలన శాఖ కసరత్తు చేస్తోంది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) - 1971 ప్రకారం సమ్మెను నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అత్యవసర సేవలు అందేలా

వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్, ప్రజా రవాణా, విద్యుత్, నీటి సరఫరా, అంబులెన్స్ సర్వీసుల లాంటి పౌరసేవలకు విఘాతం కలగకుండా ఎస్మా చట్టం అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల కార్యాచరణను అనుసరించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. దీనిపై సీఎంవోలో ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం జగన్ సమాలోచనలు జరిపారు. సీఎంతో సమావేశం అనంతరం సచివాలయంలో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగులు సమ్మెకు వెళితే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలపై సీఎస్ సమీర్​ శర్మ సమీక్షించారు.

సీఎస్​ భేటీ అనంతరం మంత్రుల కమిటీ.. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈ భేటీలో హెచ్​ఆర్ఏ, వేతన రికవరీ వంటి అంశాలపై కమిటీ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వెనక్కి తగ్గేదేలేదు..

Askar Rao: ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా తాము వెనుకాడేది లేదని పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. మానవతా దృక్పథంతో ప్రజలకు అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. రేపటినుంచి పెన్ డౌన్, ప్రభుత్వ మొబైల్ డౌన్ చేపడతామని తెలిపారు. ప్రభుత్వం వినియోగించే అన్ని మొబైల్ అప్లికేషన్లను అన్​ఇన్​స్టాల్ చేయాలని పీఆర్సీ సాధన సమితి నేత ఆస్కార్ రావు పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు:AP Employees Steering Committee: 'సమ్మెలోకి వెళ్తే.. జీతాలు మిగుల్చుకుందామని ప్రభుత్వం కుట్ర'

Pawan Kalyan: 'పీఆర్సీపై అందుకే ఇప్పటివరకు మాట్లాడలేదు'

EMPLOYEES PROTEST: పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఏపీ సచివాలయంలో పెన్​ డౌన్​

ఇదీ చదవండి:Revanth Reddy on KCR: 'మోదీ, కేసీఆర్​కు.. జిన్​పింగ్​, కిమ్​ లాంటోళ్లే ఆదర్శం..'

ABOUT THE AUTHOR

...view details