అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బు చెల్లించేందుకు అనుమతి ఇవ్వండి: ఏపీ ప్రభుత్వం - హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ
12:29 November 04
అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బు చెల్లించేందుకు అనుమతి ఇవ్వండి: ఏపీ ప్రభుత్వం
అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బు చెల్లించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ హైకోర్టును ఏపీ ప్రభుత్వం మరోసారి కోరింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన కేసులపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టును వీడియో కాన్పరెన్స్ ద్వారా ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం కోరారు. రూ.20 వేల వరకు డిపాజిట్ చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని.. ఏపీ ప్రభుత్వం రూ.1,500 కోట్లను బడ్జెట్లో కేటాయించిందని తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు వేలం ప్రక్రియ, ఇతర అంశాలపై విచారణ త్వరగా జరపాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫున న్యాయవాది కూడా కోరారు. స్పందించిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కోదండరాం ధర్మాసనం సోమవారం విచారణ చేపడతామని తెలిపింది.
ఇవీ చూడండి:అత్యద్భుతం యాదాద్రి పునర్నిర్మాణం... కనులవిందు ఆ కళాఖండం