తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Budget : రూ.2.56 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ - ap budget news updates

AP-BUDGET: ఏపీ శాసనసభలో 2022-23 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. రెవెన్యూ లోటు అంచనా రూ.17,036 కోట్లు కాగా.. ద్రవ్యలోటు రూ.48,724 కోట్లుగా మంత్రి వివరించారు.

AP Budget
AP Budget

By

Published : Mar 11, 2022, 2:49 PM IST

AP-BUDGET: ఏపీ శాసనసభలో 2022-23 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు. రెవెన్యూ లోటు అంచనా రూ.17,036 కోట్లు కాగా.. ద్రవ్యలోటు రూ.48,724 కోట్ల రూపాయలుగా మంత్రి వివరించారు. రూ.55 వేల కోట్లను రుణాల ద్వారా సమకూర్చుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. ఈ ఏడాదితో రాష్ట్ర అప్పులు రూ.4,39,394 కోట్లకు చేరుకుంటాయని మంత్రి అంచనా వేశారు.

గతేడాది చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు రూ.1,17,503 కోట్లకు గ్యారంటీలు ఇచ్చిందని మంత్రి బుగ్గన తెలిపారు. ఉచిత పథకాలకు గతేడాది కంటే రూ.800 కోట్లు ఎక్కువగా.. రూ.48,802 కోట్లు కేటాయించింది. ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేకు రూ.2 కోట్ల నిధులు కేటాయించేలా రూ.350 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అందుకోవాలన్న నీతి ఆయోగ్‌ ఆకాంక్షలను నిజం చేసేలా బడ్జెట్‌ రూపకల్పన చేశామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. బడ్జెట్‌ ప్రకటన అంతా తప్పుల తడకగా ఉందని తెలుగుదేశం ఆరోపించింది.

రూ.2.56 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌

ఇదీ చదవండి:'తెలంగాణ విద్యాయజ్ఞంలో అందరూ భాగస్వాములవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details