తెలంగాణ

telangana

ETV Bharat / city

మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు - ap latest news

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్​ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రస్తుత 15 రోజుల సీఎల్​ల(సాధారణ సెలవుల)కు అదనంగా మరో ఐదింటిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ap-govt-orders-granting-additional-five-days-cl-to-female-govt-employees
మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

By

Published : Mar 10, 2021, 9:03 PM IST

మహిళా ఉద్యోగులకు 5 అదనపు సాధారణ సెలవులను మంజూరు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 15 రోజుల సెలవులకు అదనంగా వీటిని జత చేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐదు అదనపు సీఎల్‌లు ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.

సీఎం నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా అధ్యాపకులు, లెక్చరర్లకూ అదనపు సీఎల్‌లు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:యాచించొద్దు.. శాసించాలి: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details