ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకం ప్రకటిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహక నగదు పెంపు - increased incentive for consensus in ap panchayath elections
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు రూ.20 లక్షల వరకు ప్రోత్సాహం ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు ఇచ్చారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహక నగదు పెంపు
2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2 నుంచి 5 వేల జనాభా ఉన్నవాటికి రూ.10 లక్షలు, 5 నుంచి 10 వేల జనాభా ఉన్నవాటికి రూ.15 లక్షలు, 15 వేల జనాభా దాటిన వాటికి రూ.20 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు వివరించింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు ఇచ్చారు.
ఇవీచూడండి:'సురక్షితానికి మారుపేరు మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్'