ఆనందయ్య మందు(anandayya medicine)పై ఏపీ సీఎం జగన్(cm jagan) సమీక్షించారు. సీసీఆర్‌ఏఎస్ సహా పలు సంస్థలు ఇచ్చిన నివేదికల్లోని అంశాలను ముఖ్యమంత్రికి ఆయుష్ కమిషనర్ వి.రాములు(AYUSH COMMISSIONER RAMULU), ఇతర అధికారులు వివరించారు. ఆనందయ్య మందు(anandayya medicine) వాడితే కొవిడ్ తగ్గిందనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పి, ఎల్, ఎఫ్, కె, అనే నాలుగు మందులతో పాటు, కంట్లో చుక్కల మందును ఆనందయ్య వేస్తున్నారని సీఎంకు తెలిపారు.
ముడి పదార్థాలు లేనందున 'కె' అనే మందు తయారీని అధికారుల కమిటీ ముందు చూపించలేదని అధికారులు సీఎంకు తెలిపారు. పీ, ఎల్, ఎఫ్ లతో పాటు కంటిలో ఇచ్చే డ్రాప్స్ మాత్రమే చూపించారని వి.రాములు సీఎంకు వివరించారు. కంటి డ్రాప్స్‌కు సంబంధించి కొన్ని రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ఆనందయ్య వాడే పదార్థాలు హానికరం కావని నివేదికల్లో తేలినట్లు చెప్పారు. కంటి డ్రాప్స్‌పై పూర్తి నిర్ధరణలు రావాల్సి ఉందన్నారు. ఆనందయ్య మందు కొవిడ్‌పై ఎంతవరకూ పనిచేస్తుందని సీసీఆర్‌ఎఎస్ ట్రయల్స్ చేసిందని సీఎంకు వివరించారు. ఆనందయ్య మందువల్ల కొవిడ్ తగ్గుతుందనడానికి ఎలాంటి నిర్దరణలు లేవని నివేదికలు స్పష్టం చేశాయని నివేదించారు. కాకపోతే మందు తయారీలో వాడే పదార్థాల వల్ల ఎలాంటి హాని లేవని చెప్పాయన్నారు. ఈ మందు వాడడం వల్ల కొవిడ్ తగ్గిందని చెప్పడానికి లేదన్నారు. అలాగే ఆయుర్వేదం అని గుర్తించడానికి కూడా వీల్లేదన్నారు. ఆనందయ్య ఆయర్వేదం మందుగా గుర్తించాలని కోరితే, దరఖాస్తు చేస్తే దానిపై చట్ట పరిధిలో పరిశీలనలు చేస్తామని వివరించారు.