PRC in Andhra Pradesh: ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమని ఏపీ కార్యదర్శుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కార్యదర్శుల కమిటీ.. పీఆర్సీ సహా పలు అంశాలపై చర్చించింది. పీఆర్‌సీపై సీఎం జగన్ తిరుపతిలో ప్రకటన చేశారని... ఈ మేరకు పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని వెల్లడించింది. దీనిపై స్పందించిన ఉద్యోగ సంఘాలు.. పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని..? ప్రశ్నించారు. ఫలితంగా కార్యదర్శుల కమిటీ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది.
నివేదిక ఇవ్వకపోతే ఎలా..?
bopparaju venkateswarlu on PRC Report: "కార్యదర్శుల కమిటీ వద్ద ఎలాంటి సమాచారమూ లేదు. పీఆర్సీ నివేదిక ఇవ్వకపోతే ఎలా? పీఆర్సీ అంటే ఫిట్‌మెంట్ ఒక్కటే కాదు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇంక్రిమెంట్లు చాలా ఉంటాయి. ఈ అంశాలపై సమాచారం లేదు. పీఆర్సీ నివేదిక ఇచ్చే విషయంలో స్పష్టత లేదు. నివేదిక లేకుండా పీఆర్సీ ప్రకటిస్తే అంగీకరించం. నివేదిక ఇచ్చి చర్చలు జరపాలి. తెలంగాణలో నివేదికపై చర్చ జరిగాకే పీఆర్సీ ఇచ్చారు." - బొప్పరాజు వెంకటేశ్వర్లు
కమిటీది కాలయాపనే