తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజధాని బిల్లులపై న్యాయ సలహా తీసుకుంటున్న ఏపీ గవర్నర్ - రాజధాని బిల్లులపై న్యాయసలహా కోరిన గవర్నర్

ఏపీ ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిన రాజధాని బిల్లులపై... రాజ్​భవన్​ న్యాయసలహాలు తీసుకుంటుంది. సీనియర్ అడ్వకేట్ల అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటుంది. ఆంధ్రా ప్రభుత్వం నుంచి బిల్లులు అందగానే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. సీనియర్ న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులతో చర్చించి బిల్లులపై ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు.

AP GOVERNOR
రాజధాని బిల్లులపై న్యాయ సలహా తీసుకుంటున్న ఏపీ గవర్నర్

By

Published : Jul 24, 2020, 10:51 PM IST

రాజధాని బిల్లులపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. సీనియర్ అడ్వకేట్లు అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు వివరాలు అందగానే రాజ్‌భవన్ ఈ ప్రక్రియ ప్రారంభించింది.

ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపాలని ఏపీలోని ప్రతిపక్షాలు గవర్నర్​ను విజ్ఞప్తి చేశాయి. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంతో బిల్లులు ముడిపడి ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. సీనియర్ న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులతో చర్చల అనంతరం బిల్లులపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీచూడండి:వరినారుతో కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details