తెలంగాణ

telangana

ETV Bharat / city

నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు ఏపీ గవర్నర్‌ ఆమోదం - Governor

ఏపీలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. నామినేటెడ్ ఎమ్మెల్సీలు త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

AP governor
AP governor

By

Published : Jun 14, 2021, 10:46 PM IST

ఏపీలో నాలుగు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, రమేశ్‌ యాదవ్‌, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌ రాజుల పేర్లను ప్రభుత్వం సూచించగా.. గవర్నర్ ఆమోదించారు. అంతకుముందు గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్‌ నామినేటెడ్ అభ్యర్థుల గురించి వివరించారు. అభ్యర్థులు త్వరలో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details