స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రమేశ్ కార్డియాక్ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి.రమేశ్ బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సీతా రామమోహన్ రావులపై నమోదైన కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
స్వర్ణ ప్యాలెస్ కేసు: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం..!
స్వర్ణ ప్యాలెస్ ఘటన కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పిటిషన్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
స్వర్ణ ప్యాలెస్ కేసు: హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం..!
ఈ మేరకు పిటిషన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. పి.రమేశ్ బాబు, సీతా రామమోహన్రావుకు ఊరటనిస్తూ ఏపీ హైకోర్టు ఆగస్టు 25న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఇవీచూడండి:కేంద్రమే అప్పు తీసుకొని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలి: కేసీఆర్