తెలంగాణ

telangana

ETV Bharat / city

Pension in AP : పింఛను కోత పడకుండా ఏపీ సర్కారు చర్యలు - ఏపీలో పింఛను సమస్య

Pension in AP : పెన్షన్ కోతపడకుండా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. పింఛనుదారులకు సీఎఫ్​ఎమ్​ఎస్ లోనే కొత్త మూల పెన్షన్ నిర్ధారించే మొత్తంపై కొత్త కరవు భత్యం లెక్కించి ఎంత చెల్లించాలో ఖరారు చేసింది.

Pension in AP
Pension in AP

By

Published : Jan 31, 2022, 9:09 AM IST

Pension in AP : ఏపీలో 2018 జులై 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి.. పెన్షన్ మొత్తంలో కోత పడకుండా ఆ రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంది. వారికి సీఎఫ్​ఎమ్​ఎస్ లోనే కొత్త మూల పెన్షన్ నిర్ధారించి.. ఆ మొత్తంపై కొత్త కరవు భత్యం లెక్కించి ఎంత చెల్లించాలో ఖరారు చేసింది. ఇందుకు అనుగుణంగా సీఎఫ్​ఎమ్​ఎస్​లో ప్రోగ్రాం ద్వారా మార్పులు చేసి కొత్త పెన్షన్ బిల్లులు సిద్ధం చేసింది. కొత్త మూల పెన్షన్ నిర్ణయించకుండా అంతకుముందు నెలలో ఇచ్చిన మధ్యంతర భృతిని కూడా తొలగించి తొలుత పెన్షన్ బిల్లులు సిద్ధం చేశారు. ఆ స్లిప్పులు చూసిన పింఛనుదార్లు వచ్చే పెన్షన్లో కోతపడటంతో ఆందోళన చెందారు.

Pension Issue in AP : ఈ విషయంపై సవరణ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఇతర నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు. కొత్త పెన్షన్ స్థిరీకరించే వరకు డిసెంబర్‌లో ఇచ్చినట్లు.. ఐఆర్​తో కలిపి పెన్షన్ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించి ప్రభుత్వం.. ఏజీ కార్యాలయానికి పంపకుండానే.. సీఎఫ్​ఎమ్​ఎస్ లో ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కొత్త బిల్లులు సిద్ధమయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం 4 లక్షలకు పైగా పింఛనుదార్లకు.. కొత్త స్కేళ్ల ప్రకారం జనవరి పెన్షన్ చెల్లించనున్నారు. 2018 జులై ముందు పదవీవిరమణ చేసిన వారితోపాటు ఆ తర్వాత పదవీవిరమణ చేసిన వారికీ కొత్త పెన్షన్ ఇవ్వనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details