కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈనెల 26న రైతులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతులు, కార్మికులు చేసే ఆందోళనకు వైకాపా సహా ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు.
భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు: పేర్నినాని
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్‌కు.. ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు: పేర్నినాని
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయడాన్ని ఏపీ సీఎం జగన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని పేర్నినాని చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. బంద్‌లో శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు.
ఇవీచూడండి:'విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.. ఏప్రిల్ 18న భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం'