తెలంగాణ

telangana

ETV Bharat / city

YSRCP Party colors: వాటికి పార్టీ రంగులు తొలగిస్తున్నాం: ఏపీ ప్రభుత్వం - ఏపీ ప్రభుత్వం

భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు (YSRCP Party colors) వేయబోమని.. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు (YSRCP Party colors) హైకోర్టులో ఏపీ ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది ప్రమాణపత్రం దాఖలు చేశారు.

high court on Party colors
high court on Party colors

By

Published : Oct 6, 2021, 4:35 PM IST

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు (YSRCP Party colors) హైకోర్టులో ఏపీ ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు (YSRCP Party colors) వేయమంటూ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది ప్రమాణపత్రం దాఖలు చేశారు.

పార్టీ రంగులు తొలగించి (YSRCP Party colors) ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు గతంలో ఆదేశించింది. ఈ మేరకు నేడు ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ జై భీమ్‌ జస్టిస్‌ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు.

ఇదీ చూడండి:krishna tribunal:కృష్ణా ట్రైబ్యునల్‌ నియామకంపై పిటిషన్‌ ఉపసంహరణకు సుప్రీం అనుమతి

ABOUT THE AUTHOR

...view details